వాజేడు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శబరిష్ ఆదివాసీ ప్రజలకు అండగా ఉండాలి, చట్టాల పట్ల వారికి అవగాహన కల్పించాలి మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి, పోలీస్ ఉద్యోగం బాధ్యత తో, క్రమశిక్షణతో చేయాలి విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు . జిల్లా ఎస్ పి డాక్టర్ శబరిష్ ఐపీఎస్. సీ కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్ వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా …

వాజేడు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శబరిష్

ఆదివాసీ ప్రజలకు అండగా ఉండాలి, చట్టాల పట్ల వారికి అవగాహన కల్పించాలి

మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి, పోలీస్ ఉద్యోగం బాధ్యత తో, క్రమశిక్షణతో చేయాలి

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు .

జిల్లా ఎస్ పి డాక్టర్ శబరిష్ ఐపీఎస్.

సీ కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్

వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి డాక్టర్ శబరిష్ ఐపీఎస్ తనిఖీ చేశారు.స్టేషన్ లోని రికార్డ్స్, మరియు సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్, ఆయుధ సామాగ్రిని పరిశీలించి, కేసుల నమోదు వాటి యొక్క స్థితిగతులను తెలుసుకొని పెండింగ్ కేసులను, త్వరగా పూర్తి చేయాలని ఎస్.పి. ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన వెంటనే, వారికి రసీదు అందించాలని ఎఫ్. ఐ. ఆర్ నమోదు నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు., వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివాసి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వారికి, చట్టాల పట్ల అవగాహన కల్పించాలని, వారికి అండగా ఉండాలని కోరారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమై నందున ప్రజల భద్రతే ధ్యేయంగా పనిచేయాలని, ఆదివాసి ప్రజల ప్రాణాలు బలిగొంటున్న మావోయిస్టుల కదలికల పై నిఘా పెంచాలని ఎస్పీ తెలియజేశారు.

అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణలో నమోదు కాబడని, వదిలివేయబడిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ ఉద్యోగం అనేది భాద్యతతో కూడుకున్నదని క్రమశిక్షణతో ఉద్యోగం చేయాలనీ, విధులలో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో వెంకటాపురం సి. ఐ. బి. కుమార్, వాజేడు ఎస్సై హరీష్, ఏ ఎస్ ఐ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated On 11 Oct 2024 9:06 PM IST
cknews1122

cknews1122

Next Story