డీఈవో రాసలీలలు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య… భార్య ఉండగానే మరో మహిళతో.. ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన భార్య మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపణ విడాకుల విషయంలో కోర్టులో నడుస్తున్న కేసు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నల్గొండ డీఈవో భిక్షపతి వ్యవహారం గురువారం బయటపడింది. డీఈవో, మహిళ కలిసి నల్గొండలోని రాఘవేంద్ర కాలనీలో ఉండగా.. మొదటి భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. డీఈవో మొదటి భార్య …

డీఈవో రాసలీలలు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య…

భార్య ఉండగానే మరో మహిళతో..

ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన భార్య

మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపణ

విడాకుల విషయంలో కోర్టులో నడుస్తున్న కేసు

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నల్గొండ డీఈవో భిక్షపతి వ్యవహారం గురువారం బయటపడింది.

డీఈవో, మహిళ కలిసి నల్గొండలోని రాఘవేంద్ర కాలనీలో ఉండగా.. మొదటి భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. డీఈవో మొదటి భార్య మాధవి తెలిపిన వివరాల ప్రకారం…

భిక్షపతికి, మాధవికి 14 ఏండ్ల కింద పెండ్లి అయింది. కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే డీఈవో భిక్షపతి తన పలుకుబడి ఉపయోగించి 14 ఏండ్లుగా విడాకులు రాకుండా కేసును నడిపిస్తున్నాడని,

ఈ క్రమంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, ముగ్గురు పిల్లలను కూడా కన్నాడని మాధవి ఆరోపించింది. డీఈవో, మహిళ గురువారం రాఘవేంద్ర కాలనీలో ఉండగా విషయం తెలుసుకున్న మాధవి వారిని పట్టుకొని నిలదీసింది.

అనంతరం నల్గొండ టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.డీఈవో భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపడుతామని ఎస్సై నాగరాజు చెప్పారు.

అయితే డీఈవో భిక్షపతి మహిళా టీచర్లపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతారని, తనకు లొంగకుంటే సస్పెండ్‌ చేస్తారని గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. నల్గొండలోనే ఏండ్లుగా తిష్టవేసిన డీఈవోపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు, మహిళా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated On 22 Nov 2024 9:16 AM IST
cknews1122

cknews1122

Next Story