పలమనేర్ వాసవి క్లబ్ నూతన అధ్యక్షురాలిగా రమ్య హరీష్
పలమనేర్ వాసవి క్లబ్ నూతన అధ్యక్షురాలిగా రమ్య హరీష్ పలమనేరు జనవరి 19 సి కె న్యూస్ సేవా కార్యక్రమాలలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న వాసవి వనిత క్లబ్.ఎన్నో సంవత్సరాల నుండి, వాసవి వనిత క్లబ్ చే, వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది.ఆనవాయితీలో భాగంగా... సంవత్సరంకు ఒకసారి క్లబ్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆర్యవైశ్య మండలి అధ్యక్షుడు ఆర్ వి సుభాష్ చంద్రబోస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ....ఈ రోజు …
![పలమనేర్ వాసవి క్లబ్ నూతన అధ్యక్షురాలిగా రమ్య హరీష్ పలమనేర్ వాసవి క్లబ్ నూతన అధ్యక్షురాలిగా రమ్య హరీష్](https://cknewstv.in/wp-content/uploads/2025/01/IMG-20250119-WA0017.jpg)
పలమనేర్ వాసవి క్లబ్ నూతన అధ్యక్షురాలిగా రమ్య హరీష్
పలమనేరు జనవరి 19 సి కె న్యూస్
సేవా కార్యక్రమాలలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న వాసవి వనిత క్లబ్.
ఎన్నో సంవత్సరాల నుండి, వాసవి వనిత క్లబ్ చే, వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది.ఆనవాయితీలో భాగంగా... సంవత్సరంకు ఒకసారి క్లబ్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆర్యవైశ్య మండలి అధ్యక్షుడు ఆర్ వి సుభాష్ చంద్రబోస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ....
ఈ రోజు వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలుగా భాగీరధి రమ్య హరీష్ ను ఎన్నుకోవడం జరిగింది.శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ, జిల్లా గవర్నర్ యశస్వి గుప్తా చేతుల మీదుగా….రమ్య హరీష్ ను వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రమ్య రమేష్, ఉషా ప్రకాష్, దీప్తి బాలాజీ, కవిత కుమార్, విజయ ప్రసాద్, లక్ష్మీ రాజు ఆర్ మాధవి గారు మరియు వాసవి వనిత క్లబ్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
పలమనేర్ లోని గర్ల్స్ హైస్కూల్లో వంట రూము పై కప్పు ఉరుస్తూ ఉండడంతో, ఆ కప్పు వేయడానికి వాసవి వనిత క్లబ్ చే విరాళం అందించడం జరిగింది అంతేకాక మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)