రాత్రి పడుకున్న వ్యక్తి..తెల్లారే సరికి రక్తపుమడుగులో.. కామారెడ్డి : రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రామారెడ్డి ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి రవి (41) అనే వ్యక్తి ఎప్పటిలాగే శనివారం రాత్రి ఇంట్లో మంచంపై పడుకోగా..పడుకున్న చోటే పదునైన ఆయుధంతో దుండగులు హతమార్చారు. తెల్లారే సరికి మంచంపై రక్తపు మడుగులో ఉన్న రవిని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. …

రాత్రి పడుకున్న వ్యక్తి..తెల్లారే సరికి రక్తపుమడుగులో..

కామారెడ్డి : రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రామారెడ్డి ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి రవి (41) అనే వ్యక్తి ఎప్పటిలాగే శనివారం రాత్రి ఇంట్లో మంచంపై పడుకోగా..పడుకున్న చోటే పదునైన ఆయుధంతో దుండగులు హతమార్చారు.

తెల్లారే సరికి మంచంపై రక్తపు మడుగులో ఉన్న రవిని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతుడు రవికి తన సొంత అన్న కిష్టయ్యతో భూ తగాదాలు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

ఈ విషయంలోనే కిష్టయ్య హత్యకు గురై ఉంటాడని మృతుడి భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెండు రోజుల్లో హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు. కాగా మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Updated On 20 Jan 2025 2:42 PM IST
cknews1122

cknews1122

Next Story