ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా… నిజామాబాద్ జిల్లాలో గురువారం ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఘటనలో విద్యార్థులంతా సేఫ్ గా ఉన్నారు.నవీపేట మండలం కమలాపూర్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ లోని ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు నాడాపూర్ నుంచి తమ స్కూల్ విద్యార్థులను తీసుకుని నవీపేట్ కు వెళ్తుండగా కమలాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. …
ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా…
నిజామాబాద్ జిల్లాలో గురువారం ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఘటనలో విద్యార్థులంతా సేఫ్ గా ఉన్నారు.నవీపేట మండలం కమలాపూర్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
నవీపేట్ లోని ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు నాడాపూర్ నుంచి తమ స్కూల్ విద్యార్థులను తీసుకుని నవీపేట్ కు వెళ్తుండగా కమలాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో విద్యార్థులంతా సురక్షింగా బయటపడ్డారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వలనే స్కూల్ బస్సు బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఘటనలో విద్యార్థులంతా సేఫ్ గా ఉన్నారు. నిర్లక్ష్యంగా బస్సును నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఘటనలో బస్సు బోల్తా పడినప్పటికీ విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు అంటున్నారు.
బస్సు బోల్తా పడిన సమయంలో భయంతో పిల్లలు పెద్దగా కేకలు వేసి, ఏడుస్తూ వణికిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా పిల్లలకు ప్రమాదం వాటిల్లకుండా ఉండాలంటే అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.