జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల కోసం ఇక యుద్దమే◆ ఇంటి స్థలాల కోసం ఖమ్మంలో జర్నలిస్టుల అక్రందన◆ గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ కు మొర◆ ఇంటి స్ధలాలను సాధించేంత వరకు దశల వారి ఆందోళన◆ రాష్ట్ర టీయూడబ్ల్యూజే (ఐజెయు)రాష్ట్ర కార్యదర్శి కె. రాంనారాయణ, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు◆ భారీగా కదలివచ్చి అంబేద్కర్ కు మొర పెట్టుకున్నఖమ్మం సెగ్మెంట్ జర్నలిస్టులు◆ ఏకత్రాటిపైకి వచ్చిన ఖమ్మం జర్నలిస్టు …

జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల కోసం ఇక యుద్దమే
◆ ఇంటి స్థలాల కోసం ఖమ్మంలో జర్నలిస్టుల అక్రందన
◆ గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ కు మొర
◆ ఇంటి స్ధలాలను సాధించేంత వరకు దశల వారి ఆందోళన
◆ రాష్ట్ర టీయూడబ్ల్యూజే (ఐజెయు)రాష్ట్ర కార్యదర్శి కె. రాంనారాయణ, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు
◆ భారీగా కదలివచ్చి అంబేద్కర్ కు మొర పెట్టుకున్నఖమ్మం సెగ్మెంట్ జర్నలిస్టులు
◆ ఏకత్రాటిపైకి వచ్చిన ఖమ్మం జర్నలిస్టు సమాజం

సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం, జనవరి 26 : ఖమ్మం నియోజకవర్గంలోని జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల కోసం గణతంత్ర దినోత్సవం రోజు జర్నలిస్టుల లోకం కదలివచ్చింది. మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో ను అమలు చేయాలని కోరుతూ ఖమ్మం నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కదిలివచ్చిన జర్నలిస్టులు ముక్తకంఠంతో రాజ్యంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్నారు. ఖమ్మం నగరంలో జెడ్పి సెంటర్ లోని సంఘ సంస్కర్త, దేశ ప్రజలకు స్వేచ్చ, వాక్ స్వతంత్రాన్ని ఇచ్చిన స్పూర్తి దాత మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఇళ్ళ స్ధలాలు రాకుండా అడ్డుపడుతున్న అద్రశ్యశక్తిపై జర్నలిస్టులంతా ఆదివారం అక్రందన వ్యక్తం చేశారు. దేశానికి రాజ్యంగం అధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోని 76వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్బంగా ఆదివారం జర్నలిస్టులంతా తమ న్యాయమైన హక్కును కల్పించాలని అంబేద్కరుడిని వేడుకున్నారు. గడిచిన మూడు దశబ్ధకాలంలో జర్నలిస్టుల నోటికాడికి వచ్చిన ముద్దను లాక్కుంటున్నారని, మళ్ళీ ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా ఒక్క ఖమ్మం జిల్లాలోనే జర్నలిస్టుల హౌజింగ్ సోసైటికి ప్రభుత్వం 23.02 ఎకరాల స్ధలాన్ని కేటాయించిందని, మార్కేట్ విలువ ప్రకారం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి స్ధలాన్ని స్వాధీనం చేసుకోవాలనే అనుమతి పత్రాన్ని కూడా జారీ చేసిన తరువాత ఈ పక్రియను అర్ధాంతరంగా నిలిపివేయడం జర్నలిస్టుల 25 ఏండ్ల ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన మూడు ప్రధాన జర్నలిస్టు సంఘాలు ఒక్క త్రాటిపైకి వచ్చి, ఇళ్ళ స్ధలాల సోసైటీని ప్రక్షాళన చేసుకొని ఐక్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఇంటి పట్టాలు చేతికి వచ్చే సమయంలో రాష్టాన్ని సాకుగా చూపి మా కడుపుకొట్టడం తగదన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు రాష్ట్ర క్యాబినేట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని మా ఆవేదనను, అక్రందనను అర్ధం చేసుకొని ఖమ్మం జిల్లా నుంచే జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని వారు విన్నవించుకున్నారు. జర్నలిస్టులకు, తెలంగాణ ఉద్యమ కారులకు ఇళ్ళ స్ధలాను అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తమ మ్యానిఫెస్టోలో చేర్చారని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు.

ఇళ్ల స్ధలాల కోసం ఇక ఉద్యమమే : రాంనారాయణ

ఖమ్మంలో ఇళ్ళ స్ధలాల కోసం దశలవారిగా ఆందోళనకు జర్నలిస్టులంతా సిద్దంగా ఉండాలని టీయూడబ్ల్యూజే(ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రాంనారాయణ పిలుపునిచ్చారు. జెడ్పి సెంటర్ వద్ద జరిగిన జర్నలిస్టుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగిస్తూ ఈరోజు నుంచే ఉద్యమకార్యచరణ ప్రారంభం అయ్యిందని ఇది ఆరంభమేనని అవసరం అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి అక్కడే దిగ్బంధనం చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు ఇస్తామని ఆశ చూపాయని, గత ప్రభుత్వంలో ఏకంగా జీవో జారీ చేసి స్ధలాన్ని కూడా కేటాయించిందని దానిని అమలు చేయడంలో మాత్రం ఎందకు జాప్యం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను కేటాయించారని, ఇటివలనే మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని జర్నలిస్టులకు కూడా ఇళ్ధ స్ధలాలను ఇప్పించారని, హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను ఇప్పించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా ఖమ్మం జర్నలిస్టుల హౌజింగ్ సోసైటికి ప్రభుత్వం స్ధలాన్ని కేటాయించిందని ఇతర జిల్లాలో ఎక్కడ స్ధలాన్ని కేటాయించిన దాఖలాలు లేవన్నారు. స్దల కేటాయింపుతో పాటు ప్రభుత్వ అమోదం ఉన్నందున తక్షణమే ఇళ్ధ స్ధలాలను పంపిణి చేసేవిధంగా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చోరవ తీసుకొని అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ళ స్ధలాలు దక్కేవిధంగా క్రషి చేయాలని కోరారు.

ఇండ్ల స్థలాలు ఇచ్చి తీరాల్సిందే : టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ

జర్నలిస్టులకు ప్రభుత్వ హామీ మేరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాల్సిందేనని టిజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ… ఖమ్మం జర్నలిస్టులకు గత ప్రభుత్వం 23.02 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసిందని, అటువంటి జీవో అమలు చేయవలసిన పాలకులు నేడు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అందినట్లే అంది అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఇది మంచి పరిణామం కాదని, గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని కానీ, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. అంతా రేడి అయిందనుకున్న తరుణంలో అద్రశ్య శక్తి అడ్డుకుందని సమాచారం ఉందని, సమాజసేవ కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల సానకులంగా వ్యవహరించాలని ఆయన కోరారు. నేడు అంబేద్కర్ కు ఇచ్చే వినతి పత్రంతో మొదలయ్యే జర్నలిస్టుల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఈ పోరాటం కొనసాగిస్తామన్నారు.

పని పూర్తయిన ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు అందజేయాలి : స్ధంభాద్రి జర్నలిస్టు హౌజింగ్ సోసైటి అధ్యక్షులు కనకం సైదులు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ అధికారుల పరంగా పూర్తి కావచ్చిందని, వెంటనే జర్నలిస్టులకు అందజేయాలని స్ధంభాద్రి జర్నలిస్టు హౌజింగ్ సోసైటి అధ్యక్షులు కనకం సైదులు అన్నారు. ఈ సందర్భంగా కనకం సైదులు మాట్లాడుతూ… ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం క్యాబినెట్ తీర్మాణం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల పక్షాన ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న తీరు బాధాకరమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని, ముగ్గురు మంత్రులు ఉన్నా ఖమ్మంలో మాత్రం జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇళ్ల స్థలాలు సొసైటీకి భూమి కేటాయిస్తామని కలెక్టర్ మెమో తయారు చేసి సోసైటికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో అర్ధాంతరంగా ఆపివేసి రాష్ట్రాన్ని సాకుగా చూపించి ఖమ్మం జర్నలిస్టులకు నష్టం నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే తమ గోడును రిపబ్లిక్ డే రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి వినతిపత్రమిచ్చి తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రజాప్రతినిధులకు అధికారులకు కనువిప్పు కలిగించేలా చూడాలని వేడుకున్నామన్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే దశల వారిగా పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
టీయూడబ్ల్యూజే (ఐజెయు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నలజాల వెంకట్రావ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి నాలుగు స్దంభాల్లో మూడు స్ధంభాల ప్రతినిధులు ప్రభుత్వ వేతనాలు చెల్లిస్తుండగా, నాలుగో స్ధంభమైన ఫోర్త్ ఎస్టేట్ సమాజసేవ కోసం గౌరవ వేతనాలతో చాలి చాలనీ జీవితాలను గడుపుతున్నారని అన్నారు. మాకున్న హక్కు కోసం గణతంత్ర దినోత్సవం నాడు అంబేదర్క్ కు వినతిపత్రంతో మొర పెట్టుకున్నామని అన్నారు. నేటి పాలకులు తమ మొరను అలకించి తమ ఇళ్ళ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు మాటేటి వేణుగోపాల్, మైసా పాపారావు, మైనోద్దిన్, మామిడాల భూపాల్ రావు, తాళ్ళూరి మురళీ క్రష్ణ, సాక్షి మహేందర్, టివి9 నారాయణ, ఏబీఎన్ శ్రీధర్, ఈటీవీ లింగయ్య, చిర్రా రవి, బొల్లం శ్రీనివాస్, సాంబశివరావు, ప్రశాంత్ రెడ్డి, రజనీకాంత్, గుద్దేటి రమేష్ బాబు, జనతా శివ, జనార్దనచారి, నామ పురుషోత్తం, కళ్యాణ్, పసుపులేటి సత్యనారాయణ, ఉషోదయం శ్రీనివాస్, వేణుగోపాల్, మేడి రమేష్, రాంబాబు, జగదీశ్, జానీ, రాఘవ, చక్రవర్తి టౌన్ రిపోర్టర్లు రాంబాబు, హరీశ్, మోహన్, నాగేశ్వర్ రావు, తిరుపతి, అలస్యం అప్పారావు, నాగరాజు తో పాటు సుధాకర్, విజయ్, వినయ్, రాజు, సాయి రఘునాధపాలేం, ఖమ్మం అర్బన్ మండలాల పాత్రికేయులు డెస్క్ జర్నలిస్టులు ప్రసాద్ రావు, నారాయణరావు, మహిళా జర్నలిస్టులు మధులత, ఈశ్వరీ, రోజా తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు.

Updated On 26 Jan 2025 8:48 PM IST
cknews1122

cknews1122

Next Story