వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి... హాస్పిటల్​లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందని సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్​ ఎదుట బాధిత కుటుంబసభ్యులు సోమవారం ఆందోళనకు దిగారు.హాస్పిటల్​లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. రోడా మేస్త్రీనగర్​కు చెందిన కరీమా (29) నాలుగు నెలల కిందట గాల్​బ్లాడర్​సమస్యతో మల్లారెడ్డి హాస్పిటల్​లో చేరింది. ఆమెకు డాక్టర్లు సర్జరీ చేసి, డిశ్చార్జీ చేశారు. అనంతరం టెంపరరీగా ఏర్పాటు చేసిన యూరిన్ పైప్​ను​ తొలగించాలని ఆదివారం …

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి...

హాస్పిటల్​లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందని సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్​ ఎదుట బాధిత కుటుంబసభ్యులు సోమవారం ఆందోళనకు దిగారు.
హాస్పిటల్​లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు.

బాధితుల కథనం ప్రకారం.. రోడా మేస్త్రీనగర్​కు చెందిన కరీమా (29) నాలుగు నెలల కిందట గాల్​బ్లాడర్​సమస్యతో మల్లారెడ్డి హాస్పిటల్​లో చేరింది. ఆమెకు డాక్టర్లు సర్జరీ చేసి, డిశ్చార్జీ చేశారు.

అనంతరం టెంపరరీగా ఏర్పాటు చేసిన యూరిన్ పైప్​ను​ తొలగించాలని ఆదివారం సదరు మహిళ ఆసుపత్రికి వచ్చింది.

దీంతో డాక్టర్లు పైప్​ను తొలగించి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి మళ్లీ ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు.

చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యుల, బంధువులు ఆందోళన చేశారు.

ఆగ్రహాంతో ఆసుపత్రి లోపల అద్దాలు, ఫర్నిచర్​ ధ్వంసం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Updated On 28 Jan 2025 2:08 PM IST
cknews1122

cknews1122

Next Story