మహా కుంభమేళాలో తొక్కిసలాట భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చెప్తున్నారు.ఘటనలో సుమారు 20 మంది మృతిచెందినట్లు ప్రయాగ్ రాజ్ వైద్యుడొకరు ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో తెలిపారు. అయితే, అధికారికంగా దీనిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు అధికారుల సూచనలు పాటించాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. 'మీరున్న చోటికి సమీపంలో ఉండే ఘాట్లలో స్నానాలు చేయండి. అందరూ నదీ సంగమం వద్దకే వెళ్లేందుకు …

మహా కుంభమేళాలో తొక్కిసలాట

భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చెప్తున్నారు.
ఘటనలో సుమారు 20 మంది మృతిచెందినట్లు ప్రయాగ్ రాజ్ వైద్యుడొకరు ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో తెలిపారు.

అయితే, అధికారికంగా దీనిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు అధికారుల సూచనలు పాటించాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు.

'మీరున్న చోటికి సమీపంలో ఉండే ఘాట్లలో స్నానాలు చేయండి. అందరూ నదీ సంగమం వద్దకే వెళ్లేందుకు ప్రయత్నించొద్దు' అని ఆయన భక్తులను కోరారు.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మౌని అమావాస్య రోజున స్నానాలు చేయడానికి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు బారికేడ్లు దాటే ప్రయత్నం చేయడం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలు, ఫొటోలలో కనిపిస్తోంది.

తొక్కిసలాట విషయం తెలియగానే స్థానిక పోలీసులు, భద్రత సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కొందరు భక్తులు తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు.

తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో భక్తులకు సంబంధించిన దుస్తులు, బ్యాగులు, చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్న బీబీసీ ప్రతినిధి సమీర హుస్సేన్ చెప్పారు. తొక్కిసలాట చోటుచేసుకున్న ప్రాంతంలో కూర్చున్న భక్తుడు

మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో అంబులెన్స్‌లో కూర్చుని ఏడుస్తున్న భక్తురాలు. మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట తర్వాత ఆసుపత్రి వెలుపల విలపిస్తున్న భక్తురాలు.

తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి సమీపంలో యాత్రికులను నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. మహా కుంభమేళాలో 'పుణ్యస్నానాలు' కోసం బుధవారం 10 కోట్ల మంది రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

Updated On 29 Jan 2025 12:39 PM IST
cknews1122

cknews1122

Next Story