రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, కానిస్టేబుల్ పీడీఎస్ బియ్యం కేసు నుంచి తప్పించడానికి రూ.3 లక్షలు డిమాండ్ చేసి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పోలీస్ స్టేషన్లో జరిగింది. వివరాల్లోకెళితే.. తిరుమలగిరి మండలం వడ్డేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ పై నమోదైన పీడీఎస్ బియ్యం కేసును తప్పించడానికి తిరుమలగిరి ఎస్ఐ సురేష్ రూ.3లక్షలు డిమాండ్ చేశారు. అంత …

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, కానిస్టేబుల్

పీడీఎస్ బియ్యం కేసు నుంచి తప్పించడానికి రూ.3 లక్షలు డిమాండ్ చేసి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పోలీస్ స్టేషన్లో జరిగింది.

వివరాల్లోకెళితే.. తిరుమలగిరి మండలం వడ్డేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ పై నమోదైన పీడీఎస్ బియ్యం కేసును తప్పించడానికి తిరుమలగిరి ఎస్ఐ సురేష్ రూ.3లక్షలు డిమాండ్ చేశారు.

అంత ఇవ్వలేనని చంద్రశేఖర్ రూ.లక్షా 30వేలకు సెటిల్మెంట్ చేసుకున్నాడు. అందులో భాగంగా ఈనెల 25న సూర్యాపేటలోని శ్రీసాయి ఫిల్లింగ్ స్టేషన్ ఖాతాకు ఫోన్పే ద్వారా రూ.30వేలు, 28న కానిస్టేబుల్ నాగరాజుకు రూ.30వేలు వేయించుకున్నాడు.

అరెస్టు నుంచి తప్పించడానికి మిగతా డబ్బులు ఇవ్వాలన్నారు. దాంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఎస్ఐ సురేష్ సమక్షంలో కానిస్టేబుల్ నాగరాజు రూ.70వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అంతకుముందు, 25న కానిస్టేబుల్ నాగరాజు కూడా ఫోన్పే ద్వారా మరో రూ.10వేలు లంచం తీసుకున్నాడు. మొత్తం రూ.1.40లక్షల(ఎస్ఐకి లక్ష, కానిస్టేబుల్ కు రూ.40వేలు)ను సీజ్ చేశారు. వారిద్దరిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరుచునున్నామని అధికారులు తెలిపారు.

తన తమ్ముడు రత్నాకర్ పై నమోదైన కేసులో తనను కూడా కావాలని ఇరికించారని బాధితుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్, సీఐ వెంకట్రావు, రామారావు, స్టాఫ్ శ్రీధర్, నరేష్ సంపత్తోపాటు మొత్తం 17 మంది పాల్గొన్నారు.

Updated On 29 Jan 2025 10:36 AM IST
cknews1122

cknews1122

Next Story