తప్పిన ఘోర బస్సు ప్రమాదం.. 50 మంది విద్యార్థులు సేఫ్ సూర్యాపేట జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లాలోని మునగాల మండలం జగన్నాథపురం వద్ద కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది మోడల్ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. తక్షణమే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి, కండక్టర్ సహాయంతో చాకచక్యంగా విద్యార్థులను కిందికి దింపారు. గ్రామస్తులు వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను …

తప్పిన ఘోర బస్సు ప్రమాదం.. 50 మంది విద్యార్థులు సేఫ్
సూర్యాపేట జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లాలోని మునగాల మండలం జగన్నాథపురం వద్ద కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో బస్సులో 50 మంది మోడల్ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. తక్షణమే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి, కండక్టర్ సహాయంతో చాకచక్యంగా విద్యార్థులను కిందికి దింపారు. గ్రామస్తులు వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపు చేశారు.
