బలంగా కొడుతాడంట.. ముందు సరిగ్గా నిలబడడం నేర్చుకో..
బలంగా కొడుతాడంట.. ముందు సరిగ్గా నిలబడడం నేర్చుకో.. తన స్టైల్లో మాస్ కౌంటర్ ఇచ్చిన రేవంత్! బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఓడించి ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసినా కేసీఆర్‌లో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఫామ్‌హౌజ్ లో ఉండి స్టోరీలు చెప్పొద్దని సీరియస్ …
బలంగా కొడుతాడంట.. ముందు సరిగ్గా నిలబడడం నేర్చుకో..
తన స్టైల్లో మాస్ కౌంటర్ ఇచ్చిన రేవంత్!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఓడించి ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసినా కేసీఆర్‌లో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు.
ఫామ్‌హౌజ్ లో ఉండి స్టోరీలు చెప్పొద్దని సీరియస్ అయ్యారు. అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో చెబుతామని అన్నారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే గుమ్మికింద పందికొక్కుల్లా మిగులు బడ్జెట్‌ను మింగేశారని ఆరోపించారు. అబద్ధాల వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని.. పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చిందని ఎద్దేవా చేశారు.
అయినా.. మళ్లీ ఫామ్‌హౌజ్‌లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు.
రైతులకు రైతుభరోసా, విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంట్, మహిళలకు ఫ్రీ బస్, రూ.500 గ్యాస్ సిలిండర్స్, యువతకు 50 వేల ఉద్యోగాలు ఇలా అనే పథకాలు విజయవంతంగా అమలు చేశామని.. బీఆర్ఎస్ హయాంలో లాగా రాష్ట్రాన్ని దోచుకోవడం లేదని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన లైకులు చూసి కేసీఆర్ సంతోష పడుతున్నారని మండిపడ్డారు.
రాఖీసావంత్‌కు కూడా టిక్‌టాక్‌లో లైకులు బాగానే వస్తాయని.. అదే మాదిరిగా బీఆర్ఎస్‌కు వచ్చాయని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కాలం చెల్లిన రూ.1000 నోటుతో సమానం అని.. ఆ నోటు దగ్గరుంటే జైలుకే తప్ప.. ఉపయోగం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
అధికారం పోగానే ఫామ్‌హౌజ్‌కు పరిమితం అయిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. "కేసీఆర్ సరిగ్గా నిలబడే పరిస్థితే లేదు. ఇక బలంగా కొట్టే దమ్ము ఉందా?" అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో టీచర్ నియామకాలు జరగలేదు. మా ప్రభుత్వం రాగానే 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల తరబడి నియామక ప్రక్రియ జరిగేది.
మా ప్రభుత్వం 55 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసింది. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్లక్ష్యం చేసింది. బీఆర్ఎస్ హయాంలో వర్సిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయి. మా ప్రభుత్వం రాగానే వీసీలను నియమించాం.
ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాం. 21వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించాం. ఎలాంటి వివాదం లేకుండా 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.