రైతుల పంటలపై ఫ్యాక్టరీల కాలుష్యం పడగ..? ఒకవైపు కెమికల్ ఫ్యాక్టరీ.. మరోవైపు ఐరన్ స్పాంజ్ కర్మగారం..! మోడు బా రుతున్న రైతుల పొలాలు..? రైతులకు హాని చేసే కర్మాకారాలను నిలుపుదల చేయాలి నేలకొండపల్లి బిజెపి క్షేత్రస్థాయి పరిశీలన.. డిమాండ్ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల పరిధిలోని అప్పల నరసింహపురం గ్రామపంచాయతీ పరిధిలో భద్రాద్రి ఐరన్ స్పాంజ్ కర్మాగారం ఎమ్మెస్ పి ఆర్ కెమికల్ కర్మాగారాల వలన పంటలు దెబ్బతినటమే కాకుండా పశువులు అనారోగ్యం పాలై మృత్యువాత …

రైతుల పంటలపై ఫ్యాక్టరీల కాలుష్యం పడగ..?

ఒకవైపు కెమికల్ ఫ్యాక్టరీ.. మరోవైపు ఐరన్ స్పాంజ్ కర్మగారం..!

మోడు బా రుతున్న రైతుల పొలాలు..?

రైతులకు హాని చేసే కర్మాకారాలను నిలుపుదల చేయాలి

నేలకొండపల్లి బిజెపి క్షేత్రస్థాయి పరిశీలన.. డిమాండ్

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల పరిధిలోని అప్పల నరసింహపురం గ్రామపంచాయతీ పరిధిలో భద్రాద్రి ఐరన్ స్పాంజ్ కర్మాగారం ఎమ్మెస్ పి ఆర్ కెమికల్ కర్మాగారాల వలన పంటలు దెబ్బతినటమే కాకుండా పశువులు అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పల నరసింహపురం గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణమైన కర్మాకారాలు వలన పంటలకు మసి పట్టి దిగుబడి కూడా అంతంత మాత్రమే ఉంటుందని స్థానిక రైతులు అంటున్నారు. ప్రతి ఏడాది ప్రతి పంటకు ఇదే విధంగా నష్టం జరుగుతుందని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. దుర్గంధం వెదజల్లుతూ పొగలు తో వ్యవసాయ పనులు చేయటానికి కూడా ఇబ్బందిగా మారిందని వ్యవసాయ కూలీలు అంటున్నారు. ప్రతి ఏడాది ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు కూలీలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తమకు ఉన్న కొద్దిపాటి భూముల్లో పత్తి మొక్కజొన్న వరి లాంటి పంటలు సాగు చేస్తున్న గాని దిగుబడి ఆశించిన మేర రావటం లేదని విపరీతమైన కాలుష్యం వలన నీళ్లు సైతం కలుషితమై పశువులు తాగి రకరకాల వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతున్నాయని ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం విశేషం.

రైతులకు నష్టం చేసే కర్మాగారాలను మూసివేయాలి

బాధ్యులపై చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలి
కాగా మండల పరిధిలోని అప్పల నరసింహపురం గ్రామపంచాయతీలో కాలుష్యాన్ని వెదజల్లుతూ నిర్వహిస్తున్న కర్మాగారాల వ్యవహారంపై నేలకొండపల్లి బిజెపి పార్టీ నాయకత్వానికి స్థానిక రైతులు విన్నవించుకోవడంతో శుక్రవారం కర్మాగారాలు ప్రాంతాన్ని పంట పొలాలను పరిశీలించి మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచుతున్న కర్మాగారాలను తక్షణమే మూసివేయాలని రైతులను ఆదుకొని న్యాయం చేయాలని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల బిజెపి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం పంట పొలాలను జరుగుతున్న కాలుష్యాన్ని పరిశీలించి నివేదిక తయారుచేసి కలెక్టర్ ను త్వరలో కలవనున్నట్లు స్థానిక బిజెపి నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated On 1 Feb 2025 9:24 AM IST
cknews1122

cknews1122

Next Story