భర్త వేధింపులు తాళలేక ఇంటి ముందు ధర్నా..

భర్త వేధింపులు తాళలేక ఇంటి ముందు ధర్నా..;

By :  Ck News Tv
Update: 2025-02-22 08:55 GMT

భర్త వేధింపులు తాళలేక ఇంటి ముందు ధర్నా..

Web desc : కట్టుకున్న భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన అత్తగారింట్లో వేధింపులు అధికం కావడంతో ఓ ఇల్లాలు ఇంటిముందు బైఠాయించి ధర్నాకు దిగింది.

ఈ సంఘటన హైదరాబాద్‌లోని  మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. లక్ష్మీగూడకు చెందిన శివకు నాలుగేండ్ల క్రితం లహరితో వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు కొంతకాలం అన్యోన్యంగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. భర్తకు అత్త తోడు కావడంతో వేదింపులు అధికమయ్యాయి. తరచూ తాగివచ్చి ఆమెను కొట్టేవాడు.

దీనిని తట్టుకోలేని లహరి ఆరు నెలల క్రితం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అప్పటినుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా గెంటేశారు. దీంతో తల్లిగారి ఇంట్లో ఉంటున్న ఆమె.. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీగూడాలోని శివ ఇంటి ముందు భైఠాయించారు. తనకు న్యాయం జరిగేంత వరకు ధర్నా కొనసాగిస్తానని లహరి స్పష్టం చేశారు.

Similar News