ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికుల ఆందోళన
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారు బుధవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వారు తెలిపారు. వైద్యాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఆందోళనకు దిగినట్లు వారు వెల్లడించారు. విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి కార్మికులతో చర్చలు జరిపారు.