పోలింగ్ స్టేషన్ లో మోదీ ఫ్లెక్సీలు

ఖమ్మంలో ఉద్రిక్తత;

By :  Ck News Tv
Update: 2025-02-27 05:50 GMT

పోలింగ్ స్టేషన్ లో మోదీ ఫ్లెక్సీలు

ఖమ్మంలో ఉద్రిక్తత

ఖమ్మంలో టెన్షన్.. టెన్షన్.. టెంట్ల దగ్గర మోదీ ఫెక్సీలు..ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ టీచర్ల ఆందోళన

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రికత్త చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లకు ప్రధానమోదీ ఫొటోలున్న ఫ్లెక్సీలు పెట్టారని ఉపాధ్యాయసంఘాలు ఆందోళనకు దిగాయి.

ఫ్లెక్సీలు తొలంగించంటే జైశ్రీరాం అంటూ బీజేపీ కార్యకర్తలు , నాయకులు నినాదాలు చేశారని ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీలు తొలగించాలని ఎన్నికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి ఫ్లెక్సీలను తొలగించారు.

తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం(ఫిబ్రవరి 27) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఓటర్లు.

సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతోంది.

Similar News