గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి;

By :  Ck News Tv
Update: 2025-02-24 05:00 GMT

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన ఉదయం వెంకటేశ్వర్లు(60) టేకులపల్లి మండలం ఎర్రాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం గా పనిచేస్తున్నారు

ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో గుండెపోటు రావడంతో కింద పడిపోయారు.

కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య సుజాత ఉన్నారు. వెంకటేశ్వర్లు 36 సంవత్సరాల పాటు విద్య శాఖలో పనిచేస్తున్నారు.

Full Viewటేకులపల్లి మండలంలోని చింతోని చేలక, మంగళ్ తండా, అందుగుల గూడెం ఎర్రాయిగూడెం లో ఆయన పని చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందనున్నారు.

ఎంఈఓ జగన్ నాయక్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News