తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. తన కూతురిని ప్రేమించాడని.. ఓ కుర్రాడిని గొడ్డలితో నరికాడు యువతి తండ్రి.
తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. తన కూతురిని ప్రేమించాడని.. ఓ కుర్రాడిని గొడ్డలితో నరికాడు యువతి తండ్రి.;
By : Ck News Tv
Update: 2025-03-28 04:09 GMT
తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. తన కూతురిని ప్రేమించాడని.. ఓ కుర్రాడిని గొడ్డలితో నరికాడు యువతి తండ్రి.
ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో చోటుచేసుకుంది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎలివేడు మండలం ముప్పిరి తోటకు చెందిన పూరెల్ల సాయికుమార్ అనే వ్యక్తి… అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. పూరెల్ల సాయికుమార్ వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అయితే ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో యువతి తండ్రి ఆగ్రహించాడు. తన బంధువులతో కలిసి పూరెల్ల సాయికుమార్ పై దాడి చేసి… గొడ్డలితో నరికేశాడు యువతి తండ్రి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పెద్దపల్లి జిల్లా పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.