DGCAలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు, నెలకు రూ.7 లక్షల జీతం

DGCAలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు, నెలకు రూ.7 లక్షల జీతం;

By :  Ck News Tv
Update: 2025-02-28 07:36 GMT

DGCAలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు, నెలకు రూ.7 లక్షల జీతం

web నోటిఫికెషన్స్ : డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్(FOI) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి.

మంచి చదువులు, నైపుణ్యం ఉండాలే కానీ లక్షల్లో జీతాలు అందుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ 2025 మార్చి 7 మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే.

మొత్తం ఖాళీలు: 16

విభాగాలు.. జీతం : సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ (విమానం, ఒక పోస్ట్): రూ. 7,46,000

ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ (విమానం, 10 పోస్టులు): రూ. 5,02,800

ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ (హెలికాప్టర్, 5 పోస్టులు): రూ. 2,82,౮౦౦


అర్హతలు:అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి 10+2 లేదా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాంతో పాటు చెల్లుబాటయ్యే ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ (ATPL) లేదా కమర్షియల్ హెలికాప్టర్ పైలట్ లైసెన్స్ (CHPL) కలిగి ఉండాలి. DGCA నిర్దేశించిన ఇతర అర్హత షరతులు వర్తిస్తాయి.

వయోపరిమితి :  కనీస వయస్సు- 58 సంవత్సరాలు

గరిష్ట వయస్సు- సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్.. 64 సంవత్సరాలు.

ఎంపిక విధానం: ఎటువంటి రాత పరీక్ష లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

Full Viewకాంట్రాక్ట్ వ్యవధి: ఎంపికైన అభ్యర్థులను ఒక ఏడాది పాటు కాంట్రాక్టుపై నియమిస్తారు. ఆ సమయంలో పనితీరు ఆధారంగా పొడిగింపుకు అవకాశం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్

దరఖాస్తు ప్రక్రియ : అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత ఇమెయిల్ రూపంలో దరఖాస్తు కాపీ అందుతుంది. ఆ కాపీ ప్రింట్ తీసుకొని దానిపై ఫోటో అతికించాలి.. సంతకం చేయాలి. తరువాత దానికి అవసరమైన ఇతర పత్రాలు జత చేసి కింది చిరునామాకు పంపాలి.

Recruitment Department,

A Block, Directorate General of Civil Aviation,

Opposite Safdarjung Airport,

New Delhi - 110003

దరఖాస్తులకు చివరి తేదీ: 07 మార్చి 2025 (మధ్యాహ్నం 3 గంటల వరకు) నోటిఫికేషన్ కోసం ఇక్కడ DGCA Recruitment 2025 (Engagement of Consultant (FOIs)) క్లిక్ చేయండి.

Similar News