అధికారం అంటే పెత్తనం కాదు..సేవ చేయడం_

*_పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగనన్న పాలన_*
*_అధికారం అంటే పెత్తనం కాదు..సేవ చేయడం_*
*_ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు._*
*_మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు
*_ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 6.3.2023._*
*_మన సీఎం జగనన్న పాలన పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని, ఇది చూడలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు._*
*_ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆయన సంక్షేమ పథకాల వల్ల కలిగిన లబ్ది గురించి వివరించారు._*
*_ఆయన మాట్లాడుతూ ఎల్లో మీడియా, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అవినీతికి ఆస్కారం లేకుండా గత ప్రభుత్వ పెత్తందారీ విధానానికి స్వస్తి పలికి ప్రతి గడపకు అర్హతల ప్రకారం నవరత్నాలు అమలు చేశామన్నారు. అందుకే నేడు గ్రామాల్లో ప్రజలు ప్రతి గడపలో ఆదర్శిస్తున్నారని పేర్కొన్నారు._*
*_ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి , ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న దుర్గాప్రసాద్ , మండల వైసీపీ అధ్యక్షులు బొంతా సాంబశివరావు , సచివాలయ కన్వినర్ల మండల కో ఆర్డినేటర్ లంకె అంక మోహనరావు , దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు చింకా శ్రీనివాసరావు, సర్పంచ్ రెంటపల్లి నాగరాజు , బండి వెంకట్రావు , నల్లమోతు చిన్నయ్య మునగాల శివారెడ్డి , సొసైటీ చైర్ పర్సన్ సయ్యద్ జానీ , అధికారులు తదితరులు పాల్గొన్నారు._*