ఆర్ పి ఐ పార్టీ’ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్ ఇఫ్తార్ విందు

ఆర్ పి ఐ పార్టీ’ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్ ఇఫ్తార్ విందు.
సికే న్యూస్ ప్రతినిధి
రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్) పార్టీ
ఆధ్వర్యంలో రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్”
విజయవాడ లోని ఆశా ఫంక్షన్ హాల్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు, అనంతరం సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు,
ఈ కార్యక్రమానికి జాతీయ కార్యదర్శి పిట్ట వరప్రసాద్,
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు మేక వెంకటేశ్వర రావు,
ఎన్ టి ఆర్ జిల్లా అధ్యక్షుడు
ముస్తక్ భాయ్, ఉపాధ్యక్షుడు అజీం భాయ్, కృష్ణ జిల్లా అధ్యక్షురాలు రిహనా బేగం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మహిళలు,
ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ కమిటి సభ్యులు, పార్టీ కార్యకర్తలూ, భారీగా పాల్గొన్నారు,
అమీన్ భాయ్ మాట్లాడుతూ
అల్లహ్ దయతో సమస్త మానవాళి సుఖంగా ఉండాలనీ ప్రార్ధనలు చేశాము,
నేడు ఈ దేశంలో మైనారిటీ వర్గలపై దాడులు , ఆడపిల్లలపై అత్యచారలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి,
భారత దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వారు, ఈ దేశానికి ప్రధాన మంత్రి ని, ముఖ్య మంత్రి ని, ఎన్నుకొనే ఓటుబ్యాంకు మనకు ఉంది, ఇంక ఎందుకు మన దేశంలోని ముస్లిములు ఎదో ఒక పార్టీలో, లేక నాయకుడు కింద బానిసలుగా బతుకుతున్నారు, గులంగిరి చేస్తున్నారు, మన ముస్లిం మైనారిటీ వర్గాలు ఇకనైనా కళ్లు తెరిచి రాష్ట్రానికి, దేశానికి, పనిచేసే మన ముస్లిం నాయకులను ఎన్నుకోండి అన్నారు,