గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
పులివెందుల పట్టణంలోని ఎస్‌ఈబీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎన్.నాగేశ్వరరెడ్డి బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.
వివరాలు … కడప పట్టణంలోని నివాసముంటున్న నాగేశ్వరరెడ్డి పట్టణంలోని ఎస్‌ఈబీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే కడప నుంచి పులివెందులకు వచ్చాడు.
బుధవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో తోటి కానిస్టేబుళ్లు చికిత్స కోసం పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో కడపకు రెఫర్ చేశారు. వాహనంలో కడపకు తీసుకెళుతుండగా నాగేశ్వరరెడ్డి మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్‌ఈబీ పోలీసులు తెలిపారు.
మృతుడు నాగేశ్వరరెడ్డికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఈబీ సీఐ రామాంజనేయులు, ఎస్‌ఐ కళ్యాణ్ కుమార్‌లతోపాటు పోలీసు సిబ్బంది నాగేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.