Andhra Pradesh

నా పాస్‌పుస్తకంపై ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు?

నా పాస్‌పుస్తకంపై ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు?

నా పాస్‌పుస్తకంపై ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు?


తహసీల్దారు కార్యాలయ అధికారులను ప్రశ్నించిన రైతు
‘నా పట్టాదార్‌ పాసు పుస్తకం పాతది తొలగించి, కొత్త పుస్తకం అట్టపై ముఖ్యమంత్రి జగన్‌ ఫొటో ఎందుకు పెట్టారు’ అని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిరుమాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రైతు పీరాసాహెబ్‌ మంగళవారం తహసీల్దారు కార్యాలయంలో అధికారులను నిలదీశారు.


తనకు అన్యాయం జరిగిందని ఉపతహసీల్దార్‌ రమణబాబు ముందు గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామంలో 122వ సర్వే నంబర్‌లో తనకు 6 ఎకరాల 62 సెంట్లు ఉందని, పాత పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయన్నారు. కొత్త పాస్‌ పుస్తకంలో మాత్రం 6 ఎకరాల 61 సెంట్లు ఉన్నట్లు నమోదు చేసి ఇవ్వడం ఏమిటని అధికారిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తహసీల్దారును అడుగుదామంటే ఆయన గదిలోకి అనుమతించడం లేదన్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చానని ఉపతహసీల్దారు వద్దకు వెళ్లి పుస్తకాన్ని టేబుల్‌పై విసిరేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected