ప్రతిభకు పురస్కారం

ప్రతిభకు పురస్కారం
పలమనేరు నియోజకవర్గం మార్చి 15, సీకే న్యూస్ ప్రతినిధి
రోజుకో రూపాయి పొదుపు ద్వారా వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమాలతో పాటు చదువులో ఉన్నతంగా రాణిస్తున్న విద్యార్థులకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి పలమనేర్ పట్టణంలో వినూత్నంగా రోజుకో రూపాయి పొదుపు ద్వారా వచ్చిన డబ్బుతో శ్రీ వాసవి ఆర్యవైశ్య వాట్సాప్ గ్రూప్ ద్వారా… ఈరోజు, పలమనేర్ టౌన్, బజారు వీధిలోని పరిపాటి కళ్యాణ మండపం నందు, వైశ్య విద్యార్థులకు చదువులో, అటు స్పోర్ట్స్ లో, ఉన్నతంగా రాణించిన విద్యార్థులకు అత్యంత వైభవంగా మరియు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో విద్యార్థులు చదువులో తమ అనుభవాలను, తాము ఏ విధంగా చదివింది కూలంకషంగా వివరించారు.మెడిసిన్లో మెరిట్ సాధించి, ఎంబిబిఎస్ ఎస్ వి మెడికల్ కాలేజ్ తిరుపతి నందు, మూడో సంవత్సరం చదువుతున్న, లహరి (దివ్య) కి,బీటెక్ మొదటి సంవత్సరంలో 95 శాతం సాధించిన కందూరు నిహారిక కి,బీటెక్ డేటాసైన్స్ థర్డ్ ఇయర్లో 92% సాధించిన సాయి పూజిత కి,డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లో 95% సాధించిన సాయి కీర్తన కి మరియు స్పోర్ట్స్ కోటాలో ఉన్నతంగా రాణించిన లిఖిత్ సాయి లను సన్మానించడం జరిగింది. రోజుకో రూపాయి పొదుపు ద్వారా వచ్చిన మొత్తంతో, ఈ విధంగా చదువును ప్రోత్సహించే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం పట్ల, పలువురు పట్టణ ప్రముఖులు సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.