రేపే ఇంటర్ ఫలితాలు

BIG BREAKING: రేపు ఇంటర్ ఫలితాలు
AP: రేపు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో మంత్రి బొత్స ఫలితాలను
రిలీజ్ చేస్తారని తెలిపారు.
గత నెల మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ను ఏపీ ఇంటర్ బోర్డు నిర్వహించింది. ఈ పరీక్షలకు 9.20 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యాయి. ఒకేషనల్ విద్యార్థులు మరో 83,749 మంది ఉన్నారు
బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం.. పరీక్షలు ముగిసిన 20 రోజుల్లోపే వాల్యుయేషన్ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారిగా మారుతుంది
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన కీలక అప్ డేట్ కూడా రానే వచ్చింది. సాధ్యమైనంత త్వరగా రిజల్ట్స్ ప్రకటించాలన్న లక్ష్యంతో సాగుతోన్న ఇంటర్ బోర్డ్ కసరత్తు తుది దశకు చేరుకుంటోంది
మార్చి 31న ప్రారంభమైన మూల్యాంకనం ప్రక్రియలో 2,701 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు, అధికారులు హాజరై విజయవంతంగా పూర్తి చేశారు. ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ ఏప్రిల్ 21న ముగిసింది