Andhra Pradesh

రేపే టెన్త్ ఫలితాలు

రేపే టెన్త్ ఫలితాలు

రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. అధికారిక ప్రకటన.. రిజల్ట్స్ లింక్ ఇదే!

ఏపీలో టెన్త్ ఫలితాల (AP Tenth Results 2023) విడుదల ఎప్పుడనే ఉత్కంఠకు తెరపడింది.
ఫలితాల విడుదల తేదీని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) స్వయంగా ప్రకటించారు. రేపు అంటే.. ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ఈ మేరకు విద్యాశాఖ సైతం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు https://www.bse.ap.gov.in/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 18వ తేదీన టెన్త్ ఎగ్జామ్స్ ముగిశాయి. ఈ నేపథ్యంలో రిజల్ట్స్ ఎప్పుడు విడుదలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ టెన్త్ రిజల్ట్స్ ను మే రెండో వారంలో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి గతంలో ప్రకటించారు. ఏప్రిల్‌ 19 నుంచి 26వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ సైతం నిర్వహించారు.

30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు ఈ స్పాట్ వాల్యుయేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మార్కుల టేబులేషన్ ప్రక్రియ సాగుతోంది. అయితే.. పరీక్షలు ముగిసిన 20 రోజుల్లోపే వాల్యుయేషన్, టేబులేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసి మరో సంచలానికి ఏపీ విద్యాశాఖ సిద్ధం అవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected