Andhra PradeshChittoor
వైభవంగా పత్తికొండ గంగమ్మ జాతర

వైభవంగా పత్తికొండ గంగమ్మ జాతర
పలమనేరు నియోజకవర్గం
గంగవరం మండలం పత్తికొండ గ్రామంలో వెలసిన పెద్దపులి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది
నిన్న రాత్రి అమ్మవారి శిరస్సు మెరవణి ఈరోజు అమ్మవారి నిజరూప దర్శనంతో భక్తులు పులకించి పోయారు
పత్తికొండ చుట్ట పక్కల గ్రామస్తులే కాక కర్ణాటక నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనార్థమై వస్తూ ఉంటారు
పత్తికొండ గంగమ్మ శిరస్సు అత్యంత కళాంశతో ఉంటుందని అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఉంటున్నదని భక్తుల ప్రగాఢ విశ్వాసం
పాళెగాళ్ళ శేషప్ప నాయుడు వంశీకులు అమ్మవారికి చీరా సారే ఇవ్వడం
భాగీరధి వంశీకులు అమ్మవారికి మాంగళ్య ప్రదానం చేయడం గత 170 సంవత్సరాలు నుండి సాంప్రదాయంగా వస్తున్నది
జాతర అత్యంత వైభవంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కోలాహలంగా జరిగింది ఈ జాతర కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పులకితులయ్యారు