వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం మరియు కళ్యాణోత్సవం

వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం మరియు కళ్యాణోత్సవం
పలమనేరు నియోజకవర్గం
పలమనేరు, కొత్తపేట జవిళివీధిలో గల, శ్రీ కోదండరామస్వామి భజన మందిరం నందు, ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా…. శ్రీరామ పట్టాభిషేకం మరియు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.
. ఆరుబయట శ్రీ రామ కళ్యాణం అత్యంత రమణీయంగా, చక్కని చలువ పందిళ్ళలో, శ్రీరామ కళ్యాణం మరియు పట్టాభిషేకం భక్తుల నడుమ అత్యంత వైభవంగా, జరగడం పట్ల పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
యల్లంపల్లి రాజన్న శెట్టి కుమారులైన నరేంద్ర బాబు మరియు శ్రీనాథ్ ఆధ్వర్యంలో, కళ్యాణ దాతలుగా శ్రీమతి అండ్ శ్రీ కోట అరుణ్ కుమార్, కన్యాదానం దాతలుగా, శ్రీమతి శ్రీ నటరాజ ఆచారి, పట్టాభిషేకం, శ్రీమతి మరియు శ్రీ శ్రీపురం సత్యనారాయణ శెట్టి గార్లు ఉభయ దారులుగా వ్యవహరించారు
ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.