AP అసెంబ్లీలో కొట్టుకున్న MLA లు

పరస్పరం దాడి చేసుకున్న ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. జీవో నెం. 1 పై చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టగా.. టీడీపీ నేతల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు పరస్పరం దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు.
ఏపీ అసెంబ్లీలో అల్లకల్లోలం.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రణరంగ క్షేత్రంలా మారింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మాటలు కాస్తా మితిమీరి.. ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. జీవో నెంబర్ 1పై చర్చించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఇప్పుడు ఆ చర్చ కుదరదంటూ వైసీపీ నేతలు రివర్స్ అయ్యారు. అంతే… అసెంబ్లీలో రచ్చ రచ్చ అయ్యింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు…
ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలిసింది. ఇది చూసి మిగతా సభ్యులంతా అవాక్కవగా… పరిస్థితి అదుపు తప్పడంతో.. స్పీకర్ సభను వాయిదా వేశారు.
జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా… అంగన్వాడి సమస్యలపై వామపక్ష పార్టీలు, సిఐటియు అధ్వర్యంలో అంగన్వాడీలు ఇవాళ ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.
దీనిపై ఆల్రెడీ ఏపీ అంతటా ముందస్తు అరెస్టులు, అడ్డుకోవడాలూ జరుగుతున్నాయి. దాంతో అంగన్వాడీలు చాలా చోట్ల ధర్నాలు చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో.. ఏపీ అసెంబ్లీలో ఇదే అంశం టీడీపీ , వైసీపీ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది.
రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ జనవరి 2న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది.
ఈ జీవో నెంబర్ 1 పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపడుతున్నాయి. విపక్ష పార్టీలు… సభలు, సమావేశాలు నిర్వహించకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తీసుకు వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.