అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ హల్చల్ నన్ను అరెస్టు చేయండి.. మంచు మనోజ్

నన్ను అరెస్టు చేయండి.. మంచు మనోజ్

గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ (Manchu Family) వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.

తాజాగా తిరుపతి జిల్లా (Tirupati Dist.), భాక్ర పేటలో ప్రైవేట్ రిసార్ట్స్ (Private Resorts)లో మంచు మనోజ్ స్టే చేశారు. ఘాట్ రోడ్, ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాలలో పోలీసులు (Police) సోమవారం అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని చూసి.. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం బౌన్సర్లు మనోజ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన రిసార్ట్స్ నుంచి పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. 'నన్ను అరెస్టు చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు.. నన్ను అరెస్టు చేయండి..' అంటూ మంచు మనోజ్ అన్నారు. దీంతో 'మేము అరెస్టు చేయడానికి రాలేదు.. రాత్రి పూట హైవేపైన, ఘాట్ రోడ్ ప్రాంతంలో బౌన్సర్లు ఉండటంతో ఎవరు.. అన్న వివరాలు అడిగి తెలుసుకున్నాం' అని భాక్రా పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నారు. ఈ క్రమంలో పీఎస్ దగ్గర మెట్లపై మంచు మనోజ్ కూర్చున్నారు. తాను రిసార్ట్స్‌లోఉంటే ఎందుకు వేధిస్తున్నారు.. తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారంటూ మంచు మనోజ్ పోలీసులను అడిగారు.

మంచు మనోజ్ కుటుంబంలో గొడవలు

కాగా మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత రెండు నెలలుగా టీవీ సీరియల్‌గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి గతంలో తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారి తీసింది. తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అప్పటికి ముగిసింది. మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై అటు మోహన్ బాబు.. అలాగే సోదరుడు విష్ణు వ్యవహరిస్తున్న తీరుపై మనోజ్ మండిపడటం తెలిసిందే.

కాగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు ముఖ్య అతిథిగా మంచు మనోజ్ హాజరయ్యారు. ఆయనకు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతిలో మంచు కుటుంబానికి పలుకుబడి ఉంది. దీంతో మంచు మనోజ్ చంద్రగిరి జల్లికట్టు వేడుకలకు వెళ్లడంతో అభిమానులు భారీగా హాజరయి ఆహ్వానం పలికారు. మనోజ్ కార్ టాప్ నుంచి అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలం నుండి జల్లికట్టు పండుగను చేసుకుంటున్నామని, సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 ఏళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా ఇక్కడ ఈ వేడుకను జరుపుకుంటామని, ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసులకు సహకరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను అని మంచు మనోజ్ అన్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story