ప్రభుత్వ వైద్యురాలిపై జనసేన నేత దుర్భాషలు

వైద్యురాలితో అసభ్య ప్రవర్తన... జనసేన నేత వీరంగం..

ఏం గాడిదలు కాస్తున్నారా..

ప్రభుత్వ వైద్యురాలిపై జనసేన నేత దుర్భాషలు

ప్రత్తిపాడు ఇన్‌చార్జ్‌ తమ్మయ్యబాబు ఓవరాక్షన్‌

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌

కాకినాడ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. ప్రత్తిపాడు సిహెచ్‌సీ వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు.

వైద్యురాలిపై దురుసుగా ప్రవర్తించడాన్ని ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేసింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రత్తిపాడు మండలంలోని తమ్మయ్యబాబు స్వగ్రామం లింగంపర్తికి చెందిన ఇద్దరు గాయపడ్డారు. వారిని ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు. డ్యూటీ వైద్యురాలు శ్వేత వైద్యం చేస్తుండగా.. ఓ చోటా నాయకుడు తమ్మయ్యబాబుతో మాట్లాడాలంటూ వైద్యురాలికి ఫోన్‌ ఇచ్చారు. ఫోన్‌ చేసిన నేత ఎవరో తెలీదని వైద్యురాలు చెప్పి.. బాధితులకు వైద్యం ఆరంభించారు.

కాసేపటికే ఆసుపత్రికి చేరుకున్న తమ్మయ్యబాబు ఆసుపత్రి సిబ్బందిపై మండిపడ్డారు. 'నేను ఎవరో తెలీదా.. రెస్పాండ్‌ అవ్వొద్దా? ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉద్యోగం చేయండి. ప్రజల సొమ్ము తీసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వీడియో తీస్తున్న ఆసుపత్రి సిబ్బంది నుంచి ఫోన్‌ లాక్కుని అందులోని వీడియోను తొలగించారు. ఇలా ఆసుపత్రిలో గంటకు పైగా గందరగోళం సృష్టించారు. సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ సౌమ్య, సిబ్బంది, వైద్యురాలు శ్వేతకు మద్దతుగా నిలిచారు. మహిళా దినోత్సవం నాడే వైద్యురాలిని అవమానించారని ఆగ్రహంతో ఆదివారం వైద్య సేవల్లోనూ చురుగ్గా పాల్గొనలేదు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ వైద్యురాలిని నివేదిక కోరారు.

జనసేనాని ఆదేశాలతో చర్యలు

ఈ ఘటనపై చట్టప్రకారం ముందుకెళ్లాలని అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించారని జనసేన వర్గాలు తెలిపాయి. దీనిపై నివేదిక ఇవ్వాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామిని అధిష్ఠానం ఆదేశించింది. తమ్మయ్యబాబును వెంట పెట్టుకుని తుమ్మల ప్రత్తిపాడు సీహెచ్‌సీకి ఆదివారం వచ్చారు. డీసీహెచ్‌ఎస్‌ స్వప్న, సూపరింటెండెంట్‌ సౌమ్య, డా.శ్వేత, ఆమె తల్లి, ఇతర వైద్యుల సమక్షంలో తమ్మయ్యబాబు క్షమాపణ చెప్పారు. అనంతరం ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

నా

Ck News Tv

Ck News Tv

Next Story