ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి కౌశిక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఏడాది నుంచి బోన్ మ్యారో మార్పిడికి బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

బోన్ మ్యారో మార్పిడికి కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సాయంతో బోన్ మ్యారో మార్పిడి చేయించుకున్నాడు.

సర్జరీ ఫెయిల్ కావడంతో..

ఆపరేషన్ తర్వాత కాస్త రికవరీ అయ్యాడు. అందరితో సరదాగా ఉంటూ చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలనే తన కోరిక ఉండిపోయింది. బోన్ మ్యారో ఫెయిల్యూర్ కావడంతో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.

కౌశిక్ మరణం కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ తీవ్ర సోకంలోకి నెట్టింది. తన అభిమాన హీరోని కలవకుండానే కౌశక్ మృతి చెందాడు.

Updated On 8 March 2025 5:30 PM IST
Ck News Tv

Ck News Tv

Next Story