✕
నేడు కాకినాడకు తెలంగాణ మంత్రి ఉత్తమ్
By Ck News TvPublished on 31 March 2025 11:45 AM IST
నేడు కాకినాడకు తెలంగాణ మంత్రి ఉత్తమ్

x
నేడు కాకినాడకు తెలంగాణ మంత్రి ఉత్తమ్
నేడు కాకినాడ జిల్లాలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం ఎగుమతి చేయనున్నారు.
ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కి ఎగుమతి చేయడానికి తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకున్నారు. ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం
చేసుకున్నారు. తొలి విడతగా 12, 500 టన్నులు బియ్యం కాకినాడ పోర్టు నుంచి షిప్ ద్వారా పంపించడానికి లోడింగ్ చేయనున్నారు. అయితే, నేడు బియ్యంతో ఆ షిప్ బయలు దేరనుంది. ఫిలిప్పీన్స్ కి బియ్యం లోడ్ తో వెళ్తున్న షిప్ ను జెండా ఊపి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Ck News Tv
Next Story