అలల తాకిడికి కొట్టుకుపోయిన యువకులు..

అలల తాకిడికి కొట్టుకుపోయిన యువకులు..


సముద్ర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర తీరాన సరదాగా గడుపుదాం అని వెళ్లిన ఇద్దరు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

మైరెన్‌ పోలీస్‌లు తెలిపిన వివరాల మేరకు... పర్చూరు నెహ్రూకాలనీకి చెందిన చుక్కా వంశీ (26) చిలకలూరిపేట దగ్గరలోని పసుమర్రు గ్రామానికి చెందిన షేక్‌ రహమతుల్లా ఇద్దరు రామాపురం సముద్ర తీరానికి చేరుకున్నారు.

పర్యాటకులతో కలసి ఇద్దరు సముద్రంలో స్నానాలు చేసే సమయంలో ఇద్దరు సముద్రం అలల తీవ్రతకు గల్లంతై కేకలు వేశారు. అక్కడే ఉన్న మైరెన్‌ పోలీస్‌లు, స్థానిక జాలర్లు వెంటనే స్పందించి ఇద్దరిని కాపాడి నీటిలో నుండి బయటికి తీసుకొచ్చారు.

అయితే షేక్‌ రహమతుల్లా వెంటనే కోలుకున్నాడు. మరో యువకుడు చుక్కా వంశీ సముద్ర నీరు బాగా తాగడంతో పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో అక్కడే సీపీఆర్‌ చేసి 108లో చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ వంశీ మృతి చెందాడు. వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story