దుమ్ముగూడెం మండలంలో దెబ్బతిన్న రోడ్లను సందర్శించిన పొదెం.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

ఫిబ్రవరి 04,

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య దుమ్ముగూడెం మండలం లో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్ గంగోలు, సీతారామపురం, నర్సాపురం, తురుబాక రోడ్లను పరిశీలించారు. చర్ల, వెంకటాపురం మండలాల్లోని వివిధ క్వారీల నుంచి ఇసుకను రవాణా చేస్తున్న భారీ లోడ్ లారీలు ఈ రోడ్లు అధ్వాన్నంగా మారడానికి కారణమన్నారు.

ఈ సంద‌ర్భంగా రోడ్ల దుస్థితి, ప్ర‌జ‌ల అవస్థల పై చైర్మ‌న్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మరింత నష్టం జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, రహదారులను పరిరక్షించాలని, తక్షణ మరమ్మతు పనులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు, అదేవిధంగా ఆర్థికపరమైన సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాటి ఎస్టిమేషన్ జనరేట్ చేసి వారికి సమర్పించినట్లయితే ప్రభుత్వం నుండి నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.

భారీ వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, స్థానిక సంఘాల ప్రయోజనాల కోసం రోడ్డు మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Updated On 4 Feb 2025 8:11 PM IST
Ck News Tv

Ck News Tv

Next Story