న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో లో పోలీసులను కోరిన యువతి

సెల్ఫీ వీడియో విడుదల చేసిన యువతి.

తనకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో లో పోలీసులను కోరిన యువతి.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

ఫిబ్రవరి 09,

భద్రాచలం పట్టణం లోని మెడికల్ కాలనీ కి చెందిన భరణి వెంకట కార్తీక్ అనే యువ న్యాయవాది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన యువతిని నేనే అని ఎట్టకేలకు సదరు యువతి ఆదివారం సాయంత్రం ఒక సెల్ఫీ వీడియో ను విడుదల చేసింది. అందులో తనకు కార్తీక్ తో పరిచయం ఎలా ఏర్పడింది, తనను కార్తీక్ పెళ్లి చేసుకుంటానని ఎలా మోసం చేసాడు, తదుపరిగా యువతి జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసి జరిగిన విషయాన్ని వివరించినట్లుగా తెలిపింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశానుసారం భద్రాచలం టౌన్ పోలీసులను సంప్రదించి జరిగిన విషయాన్ని తెలియజేసానని, అనంతరం కార్తిక్ ను టౌన్ పోలీసులు స్టేషన్ కి పిలిపించి జరిగిన విషయం పై వివరణ కోరి. ఇరువర్గాలు మాట్లాడుకొని విషయాన్ని సెటిల్ చేసుకోవాలని టౌన్ సీఐ తెలిపారని. పోలీసులు విషయాన్ని సెటిల్ చేసుకోమని చెప్పినప్పటి కి కార్తిక్ అందుకు భిన్నంగా వ్యవహారిస్తూ ముందేమో పెళ్లి చేసుకుంటానని చెప్పి, మొహం చాటేస్తా నేను పెళ్లి చేసుకోను.. నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని కార్తిక్ సదరు యువతీతో తెగించి చెప్పాడని, అందుకే తాను కూడా విసిగి పోయి టౌన్ పోలీస్ స్టేషన్ లో కార్తిక్ పై ఫిర్యాదు చేసానని, అదే రోజు పోలీసులు కేసు నమోదు చేసారని, కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న కార్తిక్ పరరాయ్యాడని, వీలైనంత త్వరగా పోలీసులు కార్తిక్ ను పట్టుకొని తనకు న్యాయం చేయాలంటూ అని ఆ వీడియోలో తన బాధను, ఆవేదనను వెళ్ళగక్కింది.

Ck News Tv

Ck News Tv

Next Story