ట్రాక్టర్ బోల్తా పడడంతో విరిగిన యువతి అరికాలు...
ట్రాక్టర్ బోల్తా పడడంతో విరిగిన యువతి అరికాలు...

ట్రాక్టర్ బోల్తా పడడంతో విరిగిన యువతి అరికాలు...
భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న రామభక్తుల ట్రాక్టర్ బోల్తా పడడంతో ఓ యువతి అరికాలు తెగిపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రామభక్తులు పాదయాత్రగా భద్రాచలం వెళ్తున్నారు.
గురువారం ఉదయం అలసటగా ఉండి అటుగా వెళ్తున్న ట్రాక్టర్ పైకి ఎక్కారు. నందిపాడు సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.
దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న చాగల్లుకు చెందిన కూచిపూడి మంజు (20) అనే మహిళకు అరికాలు పాదం పూర్తిగా తెగిపోయింది.
పాలకుర్తి గంగాభవాని, కొండపల్లి శ్రీనివాసరావు అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
ప్రమాదంలో అరికాలుని కోల్పోయిన కూచిపూడి మంజును మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించారు. తెగిపడిన కాలు భాగాన్ని ఐస్ బాక్సులో పెట్టి తీసుకువెళ్లారు.
