ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
![ముస్తాబవుతున్న గిరిజన మ్యూజియం ముస్తాబవుతున్న గిరిజన మ్యూజియం](https://cknewstv.in/h-upload/2025/02/12/1974906-img-20250212-wa0045.webp)
ముస్తాబవుతున్న గిరిజన మ్యూజియం.
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),
ఫిబ్రవరి 12,
ఐటీడీఏ ప్రాంగణంలో పర్యాటకుల కోసం ముస్తాబు చేస్తున్న గిరిజన మ్యూజియం గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు పూర్తిస్థాయిలో హరిత వనంగా సోబిల్లెల చూపరులకు ఆకట్టుకునే విధంగా డిజైన్ గా రూపుదిద్దుకునేలా ఏర్పాట్లు చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు
బుధవారం మ్యూజియం కమిటీ సభ్యులతో కలిసి మ్యూజియ మును సందర్శించి మ్యూజియం పరిసరాలలో ఏర్పాట్లు చేసే వివిధ రకాల పూలు మరియు షోకేజ్ చెట్లు, పచ్చటి నారుతో డిజైన్ గా వివిధ భంగిమలతో తయారుచేసిన కళాకృతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాంటేషన్ ఏర్పాటు కొరకు తీసుకువచ్చిన పూల చెట్లను సెల్ఫీ పాయింటు మరియు మంచే, నిర్మాణం చేపట్టిన గుడిసెల ముందు అందంగా అమర్చాలని అలాగే బోటింగ్ చేసే ప్రదేశంలో సేఫ్టీగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి పూర్తిగా చదును చేయాలని, సందర్శకులు కూర్చొని బోటింగ్ తిలకించడానికి డైనింగ్ టేబుల్స్ మరియు కుర్చీలు వెదురుతో తయారు చేసినవి ఏర్పాటు చేయాలని, మంచే పై కూడా వెదురుతో తయారుచేసిన డైనింగ్ సెట్ కుర్చీలు అందంగా అమర్చాలని, గిరిజన మహిళలు, గిరిజన రైతులు వ్యవసాయ పద్ధతులు, వారి జీవన విధానాలు, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పెయింటింగ్స్ 15 రోజులలో పూర్తయ్యే విధంగా చూడాలని, బాక్స్ క్రికెట్ కోసం ఏర్పాటు చేస్తున్న గ్రౌండ్ నిర్మాణం పనులు ప్రారంభించాలని అన్నారు. ప్లాంటేషన్ ఏర్పాటు కొరకు తీసుకువచ్చిన పూల చెట్లను మరియు వివిధ భంగిమలతో తయారుచేసిన కళాఖండాలను పర్యాటకులు చూసి సెల్ఫీ ఫోటోలు దిగే విధంగా అమర్చాలని ఉద్యానవనాధికారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, డి ఈ హరీష్, టి ఏ శ్రీనివాస్, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి, క్రాఫ్ట్ టీచర్లు సరస్వతి, సునంద తదితరులు పాల్గొన్నారు.
![Ck News Tv Ck News Tv](/images/authorplaceholder.jpg?type=1&v=2)