దొంగతనం నెపంతో దళితుడిపై ఏఎస్సై థర్డ్ డిగ్రీ...
దొంగతనం నెపంతో దళితుడిపై ఏఎస్సై థర్డ్ డిగ్రీ...

దొంగతనం నెపంతో దళితుడిపై ఏఎస్సై థర్డ్ డిగ్రీ...
థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో కోడి పుంజు చోరీ విచారణలో ఒక దళితుడిని చిత్రహింసలకు గురి చేసిన ఎస్ఐ రామ్మూర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు మాట్లాడారు. కోడిపుంజును దొంగిలించారంటూ అప్పారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఏఎస్సై రామ్మూర్తి చిత్రహింసలు పెట్టారని నాగరాజు ఆరోపించాడు.
దళిత సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు మాట్లాడుతూ దొంగతనం నెపంతో దళితుడిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం దారుణమని, దీన్ని స్పెషల్ కేసుగా తీసుకొని ఏఎస్సై పై చర్యలు తీసుకోవాలని
ఎస్పీ, డీజీపీని కోరారు.
