త్రాసుపామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ భార్గవ్.

త్రాసుపామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ భార్గవ్.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మార్చ్ 03,

గత నాలుగు రోజులుగా పినపాక మండలం ఉప్పాక ప్రాథమికోన్నత పాఠశాల దగ్గరలో గల పురాతన బావిలో పడి ఉన్న గోధుమ త్రాసు పామును, ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన స్నేక్యాచార్ భార్గవ్ పట్టుకున్నారు. సామాజిక కార్యకర్త బోడ లక్ష్మణరావు సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన సమాచారం మేరకు, పినపాక మండల పంచాయతీ అధికారులు ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకొని స్నేక్ క్యాచర్ భార్గవ్ సహాయంతో పామును బయటకు తీసే విధంగా చర్యలు తీసుకున్నారు.

భార్గవ్ మాట్లాడుతూ.. అంతరించిపోయే ప్రాణుల జాబితాలో గోధుమ త్రాసు సైతం ఉందని, వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించొద్దని, ఇక్కడ ఏ ఇబ్బంది కలిగిన తనకు సమాచారం అందిస్తే తప్పకుండా వచ్చి సహాయం అందిస్తానని భార్గవ్ తెలిపారు. కార్యక్రమంలో పినపాక ఎంపీఓ కే.వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story