అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం

అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనమయ్యారు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ అన్నపురెడ్డిపల్లి ప్రతినిధి, (సాయి కౌశిక్ ),

03 ఏప్రిల్,

అన్నపురెడ్డి పల్లి మండలం ఎర్రగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని తాలకదారు బంజర గ్రామంలో గత రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది.

అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

షేక్ యాకుబ్ పాషా, గౌస్ పాషా అనే ఇద్దరు వ్యక్తుల ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలో గౌస్ పాషా (34) అనే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.

అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో గౌస్ పాషా ఇంట్లో నుండి బయటికి రాలేకపోయాడు.

కుటుంబ సభ్యులు అతనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించిన మంటలు వ్యాప్తి చెందడంతో ఏమి చేయలేకపోయారు.

దీంతో అగ్నికి ఆహుతి అయ్యాడు.

మృతుడు గౌస్ పాషా భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.

అర్ధరాత్రి కావడంతో బాధితులు ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు.

ఇంట్లోని గృహపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి అని, కట్టు బట్టలతోనే బయటపడ్డామని బాధితులు తమ ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్తులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ సహాయంతో మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు..

Ck News Tv

Ck News Tv

Next Story