సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి కార్మికుల ధర్నా

హాస్పిటల్ కార్మికుల కడుపు మాడుస్తున్న ప్రభుత్వం.....!

సిఐటియు కన్వీనర్ ఎం.బి నర్సారెడ్డి...

సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి కార్మికుల ధర్నా

సూపర్డెంట్ ముదిగొండ రామకృష్ణ కి వినతి పత్రం

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

ఫిబ్రవరి 06,

ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు గత ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వాళ్ల కడుపులు మాడుస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చర్యలను నిరసిస్తూ ఏరియా హాస్పిటల్ ముందు శానిటేషన్ ,పేషంట్ కేర్ ,సెక్యూరిటీ సిబ్బంది ముకుమ్మడిగా హాస్పటల్ గేటు ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ హాస్పటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చే అరకొర వేతనాలు కూడా సక్రమంగా సకాలంలో ఇవ్వకపోవడం వలన వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారి అప్పులు కూడా దొరకక ఇంటిలో ఉన్న వస్తువులను తనకా పెట్టుకుని జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఇంటి అద్దెకట్టలేక పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక నిత్యవసర వస్తువులు ఇచ్చే కిరాణాల్లో ఇవ్వకపోవడం వలన ఏమి చేయాలో పాలు పోని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. గత ప్రభుత్వం లో కూడా ఇదే విధానం కొనసాగినప్పటికీ ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం మార్పు లేకపోవడం వలన వారి జీవితాల అ గమ్య గోచరంగా మారినాయని విమర్శించారు. కార్మికుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కరెక్ట్ గా ప్రతినెలా లక్షల లక్షలు జీతాలు పొందుతూ కార్మికుల సమస్యలు మాత్రం అసెంబ్లీలో చర్చించే తీరిక కూడా లేకపోవడo చాలా దుర్మార్గమని విమర్శించారు. ఇది ప్రజా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ మేము బ్రహ్మాండంగా ఆసుపత్రులకు నిధులు కేటాయిస్తున్నామని డాంబిగాలు పలుకుతున్నది తప్ప ఆచరణలో శూన్యమని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కార్మికుల జీతభత్యాల విషయంలో కలగజేసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాలు విడుదల చేయకపోతే ఈ నెల 15వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానికంగా ఉన్నటువంటి పిఓ జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపి వీరి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేసినారు. అనంతరం ఏరియా ఆసుపత్రి సిబ్బంది ముదిగొండ రామకృష్ణ కు వినతి పత్రం అందించారు. కార్మికుల ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎం శివాజీ సిఐటియు నాయకులు అజయ్ కుమార్ రాఘవయ్య మరియు హాస్పటల్ కార్మిక సంఘ నాయకులు రమ, రమణమ్మ, కృష్ణ, నరేంద్ర, రమేష్ ,వరలక్ష్మి ,,అంజలి కుమారి ,బయమ్మ తదితరులు పాల్గొన్నారు

Admin

Admin

Next Story