కూతురిని ప్రేమించిన పెళ్లయిన యువకుడు హత్య చేసిన తండ్రి

తెలంగాణలో మరో పరువు హత్య కలకలం.. యువకుడిని కిరాతకంగా చంపిన యువతి తండ్రి

తెలంగాణ(Telangana)లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని దశరథ్(26) అనే యువకుడిని గోపాల్ అనే వ్యక్తి అతి దారుణ హత్య చేశారు.

అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంచాడు. దశరథ్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఐదు రోజుల తర్వాత అసలు విషయం తెలిసింది. గోపాల్‌ను గట్టిగా మందలించగా.. తానే చంపానని ఒప్పుకుని శనివారం పోలీస్ స్టేషన్‌(Police station)లో లొంగిపోయాడు. ఆదివారం ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోపాల్‌తో కలిసి స్పాట్‌కు వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంగారెడ్డి(Sangareddy) జిల్లా నిజాంపేట మండలం ఈదులతండా శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దశరథ్‌ను హతమార్చాడు. అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

దశరథ్‌కు గోపాల్‌ తన కుమార్తెతోనే ఫోన్‌ చేయించి ట్రాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మెగ్యానాయక్‌ తండా వద్దకు రాగానే అతడితో నిందితుడు వాగ్వాదానికి దిగాడు. ''పెళ్లయినవాడివి.. నా కుమార్తెను ఎందుకు ప్రేమిస్తున్నావు? ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు?'' అని గొడవపడ్డాడు. ఈ క్రమంలో కోపంతో దశరథ్‌ను బండరాయితో గోపాల్‌ కొట్టి చంపాడు. అనంతరం పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. మృతదేహం పూర్తిగా కాలలేదని ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ముక్కలను వేర్వేరు ప్రాంతాల్లో పారేశాడు. రాత్రి నిందితుడిని విచారించిన పోలీసులు.. అనంతరం మెగ్యానాయక్‌ తండా శివారులోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని కాల్చిపడేసిన చోటుకు వెళ్లారు. మృతదేహానికి శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్‌ మండలంలోని నాగధర్‌రాంచెందర్‌ తండాకు చెందిన ఆంగోత్‌ దశరథ్‌(26).. కొన్నాళ్లుగా సంగారెడ్డిలోని గణేష్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు స్వస్థలంలోనే నివసిస్తున్నారు. మూడు రోజుల కిందట లారీ యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపై దశరథ్‌ స్వగ్రామానికని వెళ్లాడు. స్థానికంగా లేకపోవడం, స్వగ్రామానికి చేరుకోకపోవడంతో ఆయన భార్య సంగారెడ్డి రూరల్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా.. శుక్రవారం అదృశ్యం కేసు నమోదైంది. శనివారం నిజాంపేట్‌ మండలంలోని మెగ్యానాయక్‌తండాకు చెందిన గోపాల్‌ తానే దశరథ్‌ను హత్య చేశానని నారాయణఖేడ్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబడుతున్నట్లు సమాచారం.

కాగా, ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సూర్యాపేట పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ(30)కు సూర్యాపేట పట్టణంలోని పిల్లలమర్రి ప్రాంతానికి చెందిన కోట్ల నవీన్‌ అనే వ్యక్తి చెల్లెలు భార్గవితో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. దీనిని తట్టుకోలేకపోయిన నవీన్.. సినిమా స్టైళ్లో ప్లాన్ వేసి.. కృష్ణను హతమార్చాడు. ఈ ఘటనను ఇంకా మరువకముందే సంగారెడ్డిలో ప్రేమ పేరుతో యువకుడ్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది.

Ck News Tv

Ck News Tv

Next Story