✕
కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు.. సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు
By Ck News TvPublished on 3 April 2025 5:58 PM IST
కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు.. సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు

x
కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు.. సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు పెట్టి కలెక్టర్ కార్యాలయాన్ని పేల్చివేస్తామని, ఓ ఆగంతకుడు కలెక్టరేట్ కు మెయిల్ పెట్టాడు.
దాంతో ఈ విషయంపై విచారణ చేయాలని కలెక్టర్ గౌతం డీసీపీ కోటిరెడ్డికి ఆదేశాలు ఇవ్వడంతో ఆయన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే అంశంపై విచారణ చేస్తున్నారు.
కాగా కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు నేపథ్యంలో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం అయ్యారు.
కరీంనగర్ కు చెందిన మావోయిస్టు లక్ష్మణరావు పేరిట మెయిల్ వచ్చింది. అందులో ఆఖరిగా అల్లాహు అక్బర్ అనే నినాదం ఉండటం గమనార్హం.
కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులను బయటకు పంపించిన పోలీసులు.. డాగ్ స్క్వాడ్ తో తనీఖీలు చేపట్టారు.

Ck News Tv
Next Story