
సీఎం కు సీఐ లీగల్ నోటీసులు.. అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు. తనకు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని శంకరయ్య డిమాండ్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబుకు లీగల్ నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది.. వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దురుద్దేశ పూరితంగా సీఎం చంద్రబాబు పలు మార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తున్న సీఐ శంకరయ్య..
న్యాయవాది జి. ధరణేశ్వరరెడ్డి ద్వారా ఈ నెల 18వ తేదీన నోటీసులు పంపారు. అయితే ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తన ప్రతిష్టకి భంగం కలిగించేలా మాట్లాడిన చంద్రబాబు..
అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాక, తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు కోటి 45 లక్షల రూపాయలు పరువు నష్టం కింద చెల్లించాలని సీఐ శంకరయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, ఈ నోటీసులపై సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..




