ManchiryalaTelangana

ఆదివాసి ఆదివాసి మేధావుల వేదిక తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బత్తుల ప్రకాష్ నియామకం

సెప్టెంబర్ 4 ( సీ కే న్యూస్)

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలానికి చెందిన బత్తుల ప్రకాష్‌ను తెలంగాణ రాష్ట్ర ఆదివాసి మేధావుల వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించినట్టు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అనుముల వంశీకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బత్తుల ప్రకాష్ ఆదివాసి సమాజ అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం కృషి చేస్తూ పలు ఉద్యమాల్లో ముందుండి పోరాడారని గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఆదివాసుల భూమి హక్కులు, విద్య, ఉపాధి, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై బత్తుల ప్రకాష్ శ్రద్ధగా పనిచేస్తున్నారని తెలిపారు.
అదే విధంగా, ఆదివాసి మేధావుల వేదిక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం ఎల్లప్పుడూ ముందుండి పోరాటాలు నిర్వహిస్తోందని, సమాజ అభివృద్ధి కోసం తమ వేదిక ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం ప్రకాష్ మాట్లాడుతూ, ఈ నియామకం తనకు మరింత బలం, స్పూర్తినిచ్చిందని, ఆదివాసుల హక్కుల సాధన కోసం అన్ని వర్గాల మద్దతుతో పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. వేదిక తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బత్తుల ప్రకాష్ నియామకం

సెప్టెంబర్ 4 ( సీ కే న్యూస్)

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలానికి చెందిన బత్తుల ప్రకాష్‌ను తెలంగాణ రాష్ట్ర ఆదివాసి మేధావుల వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించినట్టు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అనుముల వంశీకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బత్తుల ప్రకాష్ ఆదివాసి సమాజ అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం కృషి చేస్తూ పలు ఉద్యమాల్లో ముందుండి పోరాడారని గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఆదివాసుల భూమి హక్కులు, విద్య, ఉపాధి, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై బత్తుల ప్రకాష్ శ్రద్ధగా పనిచేస్తున్నారని తెలిపారు.
అదే విధంగా, ఆదివాసి మేధావుల వేదిక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం ఎల్లప్పుడూ ముందుండి పోరాటాలు నిర్వహిస్తోందని, సమాజ అభివృద్ధి కోసం తమ వేదిక ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం ప్రకాష్ మాట్లాడుతూ, ఈ నియామకం తనకు మరింత బలం, స్పూర్తినిచ్చిందని, ఆదివాసుల హక్కుల సాధన కోసం అన్ని వర్గాల మద్దతుతో పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button