
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా మంత్రి పొంగులేటి
- జర్నలిస్టుల సాధకబాధకాలు తెలుసు
- జుజూబీ మాటలు నేను చెప్పను..
- ఖమ్మం రోల్ మోడల్‌గా ఉండేలా చూస్తా..
- ఎన్నికల కోడ్ ముగిశాక ప్రక్రియ ముందుకు
- కొందరు జర్నలిస్టులతో కమిటీ ఏర్పాటు
ఖమ్మం: జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరంగా చిక్కులు లేకుండా… నిపుణుల సలహాతో ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ రోల్ మోడల్ గా ఉండేలా చేస్తామన్నారు. ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం తనను కలిసి వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులతో మంత్రి చర్చించారు. జుజూబి మాటలు చెప్పనని, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని, కోడ్ పూర్తయ్యాక జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతో చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుందామన్నారు. జర్నలిస్టుల్లో చాలామంది పేదలు ఉన్నారు…
వాళ్ల సాధక బాధకాలు నాకు తెలుసు కాబట్టి, ముందుగానే డబ్బులు కట్టించి.. కాలయాపన చేస్తూ మభ్యపెట్టే తీరు నాది కాదని స్పష్టం చేశారు. ఆకలితో అలమటించి, రూపాయి రూపాయి పోగేసుకునే ఏ ఒక్క జర్నలిస్టు డబ్బులు వృధా కావద్దని.. ఆ దిశగానే నా ప్రయత్నం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
ఎలా వీలైతే అలా… నిపుణుల సూచన మేరకు ముందుకెళ్దామన్నారు. ఏదో ఒక రకంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటివాటిని పట్టించుకోను, కాని జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి తో వున్నానని స్పష్టం చేసారు కొంతమంది జర్నలిస్టు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేద్దాం అన్నారు.
మంత్రిని కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టులుV6 బ్యూరో సయ్యద్ ఖదీర్, నవ తెలంగాణ బ్యూరో కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, దిశ బ్యూరో సాగర్ దువ్వ, టీవీ 9 బ్యూరో నారాయణ, టీవీ 5 బ్యూరో నాగేశ్వర్ రావు, మహా టీవీ బ్యూరో రామకృష్ణ, జనం సాక్షి బ్యూరో కూరాకుల గోపి, ఇండియా టుడే బ్యూరో సంజీవరావు, మహా టీవీ బ్యూరో రామకృష్ణ, 6టీవీ బ్యూరో అయ్యప్ప, పీటీఐ నాగేశ్వర్ రావు, మహా టివి రామకృష్ణ, జనంసాక్షి స్టాఫర్ షేక్ సుభాన్, రాష్ట్రీయ సహారా మొహమ్మద్ ఇంతియాజ్, మున్సిఫ్ బ్యూరో రియాసతుల్లాహ్, అర్షీన్ , వీ5 కేవీ, నవతెలంగాణ రిపోర్టర్ గరిడేపల్లి వెంకటేశ్వర్లు, దిశ రిపోర్టర్ మూర్తి, జీ న్యూస్ రవి, జనంసాక్షి కనకరాజు, సేన నరేష్, ఉప్పలయ్య, లక్ష్మణ్, కెమెరామెన్లు యాకూబ్ పాష, షేక్ ఫయాజ్, అర్షద్, యూసుఫ్, జాకీర్, రంగా, సతీష్ తదితరులు పాల్గొన్నారు.