
విలేఖరి పై అసభ్య పదజాలంతో దూషించి, అవమాన పరిచిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
టౌన్ పోలీస్ స్టేషన్లో 166 సెక్షన్ల కింద కేసు నమోదు
సికె న్యూస్ చింతకాని ప్రతినిధి జి పిచ్చయ్య
మధిర లో ఆర్ వి కాంప్లెక్స్ వద్ద జరిగిన వివాదంలో మాటూరు గ్రామానికి చెందిన మోదుగు కిరణ్, కొత్త పవన్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి.. విధి నిర్వహణలో ఉన్న ప్రజాదర్బార్ మధిర నియోజకవర్గ ఇంచార్జి
కటికల శ్యాంబాబు, విలేఖరి పై అసభ్య పదజాలంతో దూషించి తన వృత్తిని అవమానపరిచిన ఇద్దరు వ్యక్తుల పై మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో 166 సెక్షన్ల కింద కేసు నమోదు.. చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయం పై ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మక్కెన నాగేశ్వరరావు, గౌరవ సలహాదారులు అట్లూరి సాంబిరెడ్డి, కొంగర మురళి ,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు బాలస్వామి చేకూరి వినోద్, కోశాధికారి పల్లపోతుల ప్రసాద్ మాట్లాడుతూ మీడియా పై మీడియాలో పనిచేస్తున్న విలేకరులపై అవమానపరిచిన దాడి, చేసిన సహించేది లేదని, వారు తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో మధిర ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.




