Crime
కట్టుకున్న భర్తే కడతేర్చాడు

కట్టుకున్న భర్తే కడతేర్చాడు
ఖమ్మం బస్సు డిపో రోడ్డులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మద్యం మత్తులో కట్టుకున్న భర్తే భార్యపై రోకలిబండతో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య దేవమణి మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి ఖమ్మంలోని బస్ డిపో ప్రాంతంలో చోటు చేసుకుంది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్త రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. దేవమణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఎక్కిరాల దేవమణి ఆర్టీసీ ఖమ్మం డిపో కండక్టర్ గా పని చేస్తుంది. ఆమె భర్త రాంబాబు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.