కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఉరివేసుకొని తండ్రి మృతి
కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఉరివేసుకొని తండ్రి మృతి
![కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఉరివేసుకొని తండ్రి మృతి కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఉరివేసుకొని తండ్రి మృతి](https://cknewstv.in/h-upload/2025/02/11/1974896-n651559311173928946029859bad64cf4fe5beb94fb8ba584d5a7b7c1a72916ce4ed36aea4c169396d500ed.webp)
కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఉరివేసుకొని తండ్రి మృతి
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి మనస్తాపం చెంది చనిపోయిన ఘటన హుస్నాబాద్ మండలం లో చోటుచేసుకుంది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మడద గ్రామానికి చెందిన పత్తి రాజు (45)కు కుమారుడు ఆకాష్(18), కూతురు అక్షితలు (24)ఉన్నారు. కాగా 3 సంవత్సరాల క్రితం అక్షిత అమ్మమ్మ ఊరు అయిన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే ఈ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు దారి తీసింది. దీంతో అప్పటి నుండే రాజు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ప్రేమగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు వెళ్లిపోయి పెళ్లి చేసుకుందని తీవ్రమైన మనస్థాపానికి గురైన క్రమంలో ఉదయమే రాజు భార్య ఉపాధి హామీ పనికి వెళ్ళిపోయింది. కొడుకు ఆకాశ్ ను బావి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని చనిపోయాడు. కాగా బావి దగ్గరికి వెళ్లి వచ్చిన కొడుకు ఆకాష్ తలుపులు తీసి చూడగా తండ్రి ఉరివేసుకొని చనిపోవడం చూసి ఏడుస్తుండగా స్థానికులు అక్కడకు చేరి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.
![Ck News Tv Ck News Tv](/images/authorplaceholder.jpg?type=1&v=2)