✕
స్నేహితుడి పెళ్లికి వెళ్లి.. విగతజీవిగ మారాడు
By Ck News TvPublished on 11 March 2025 9:25 AM IST
స్నేహితుడి పెళ్లికి వెళ్లి.. విగతజీవిగ మారాడు

x
స్నేహితుడి పెళ్లికి వెళ్లి.. విగతజీవిగ మారాడు
ఖమ్మం రూరల్ : మండలంలోని బారు గూడెం పంచాయతీ పరిధిలో గల శ్రీ సిటీ లో నివాసముంటున్న పిట్టల సుధాకర్-నిర్మల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మనీష్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తన స్నేహితుడు వివాహానికి మనీష్ శనివారం వెళ్లాడు.పెళ్లి వేడుక వద్ద నుంచి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఆళ్లగడ్డ వద్ద కారు ప్రమాదానికి గురై మనీష్ (31) అక్కడికక్కడే ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతునికి సంవత్సరం క్రితమే వివాహం జరిగింది. మృతుని తండ్రి సుధాకర్ ఆర్టీసీలో ఎస్ డబ్ల్యూఎఫ్ యూనియన్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మృతదేహం మంగళవారం ఖమ్మంకు చేరుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మనీష్ మరణ వార్త విని కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

Ck News Tv
Next Story